నైతం రాజు సంస్మరణ సభను జయప్రదం చేయాలి

28-10-2026 | 08:20pm

ఆసిఫాబాద్,  (విజయక్రాంతి):ట్యాగ్స్ జిల్లా ఉపాధ్యక్షుడు నైతం రాజు(TAGS District Vice-President Naitam Raju) సంస్మరణ సభను గురువారం ఆసిఫాబాద్ పట్టణంలోని రోజ్ గార్డెన్ ఫంక్షన్ హాల్లో నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధ్యక్షుడు కోట శ్రీనివాస్ తెలిపారు. బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బెజ్జూర్ మండలం సోమిని గ్రామానికి చెందిన నైతం రాజు ఆదివాసీ పోరాటాల్లో చురుకుగా పాల్గొన్నారని, అక్టోబర్ 12న అనారోగ్యంతో మృతి చెందారని పేర్కొన్నారు.

సభకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి, కేవీపీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు జాన్ వెస్లీ, ట్యాగ్స్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూసం సచిన్, బండారు రవికుమార్, భూపాల్, ఎండీ అబ్బాస్, పైళ్ల ఆశయ్య, ఎం.వి. రమణ, ఎస్.వి. రమ, శోభన్, నగేష్ హాజరవుతారని తెలిపారు. ఈ సమావేశంలో కూశన రాజన్న, దుర్గం దినకర్, జె. రాజేందర్, గోడిసెల కార్తీక్, గేడెం టికానంద్, దుర్గం నిఖిల్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు