రైతు నేస్తం కాంగ్రెస్ ప్రభుత్వం..

28-10-2026 | 08:18pm

చెరుకు శ్రీనివాస్ రెడ్డి .

చేగుంట అక్టోబర్ 28, విజయక్రాంతి: చేగుంట మండలం రుక్మాపూర్ గ్రామంలో ఐకేపీ వడ్లు కొనుగోలు(IKP Paddy Procurement) కేంద్రంను ప్రారంభించిన దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి . ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు నేస్తం, రైతు పక్షపాతి అని ఎల్లప్పుడూ రైతుల సంక్షేమం కోసం పాటు పడే ప్రభుత్వం అని తెలిపారు.  రైతులకు వడ్లు కొనుగోలు విషయం లో ఎలాంటి ఇబ్బంది కలుగ కుండా చూడాలని అధికారులకు కోరడం జరిగింది. 

ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ తాడెం వెంగళరావు, చేగుంట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాశ బోయిన భాస్కర్,  పిఏసిఎస్ చైర్మన్ మేకల పరమేష్, రుక్మాపూర్ గ్రామ సర్పంచ్, నవీన్ యాదవ్, మెదక్ జిల్లా కార్యదర్శి జూకంటి రాజా గౌడ్, , చేగుంట సర్పంచ్ సండ్రుకు స్రవంతి సతీష్, బోనాల సర్పంచ్ నాగులు,

వడియారం గ్రామ సర్పంచ్ అంకన్న  సాయికుమార్ గౌడ్, పులిమామిడి సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, చిన్న శివునూరు ఉపసర్పంచ్ బోల్ల ప్రశాంత్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు ముజామిల్, స్టాలిన్ నర్సింలు, ఆంజనేయులు, ఎస్సి సెల్ అధ్యక్షులు మాసాయిపేట శ్రీనివాస్, సీనియర్ నాయకులు కొండి శ్రీనివాస్, యువ నాయకులు సండ్రుగు శ్రీకాంత్,  గ్రామస్తులు రైతులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు