మలక్‌పేట యశోద ఆసుపత్రిలో అరుదైన శస్త్రచికిత్స

28-10-2026 | 08:29pm

85 ఏళ్ల వృద్ధుడికి లాప్రోస్కోపిక్ పద్ధతిలో పిత్తాశయ శస్త్రచికిత్స విజయవంతం

కోదాడ అక్టోబర్ 28(విజయ క్రాంతి): మలక్‌పేట యశోద సూపర్ స్పెషాలిటీ (Yashoda Super Speciality)ఆసుపత్రిలో 85 ఏళ్ల వృద్ధుడికి లాప్రోస్కోపిక్ పద్ధతిలో పిత్తాశయ శస్త్రచికిత్సను వైద్యులు విజయవంతంగా నిర్వహించారు. చిలుకూరుకు చెందిన పి. పుల్లయ్య కొంతకాలంగా జ్వరం, కడుపునొప్పితో బాధపడుతుండగా, సమగ్ర వైద్య పరీక్షల ద్వారా ఆయన అనారోగ్యానికి గల కారణాలను గుర్తించి శస్త్రచికిత్స చేసినట్లు వైద్యులు వెల్లడించారు.

కోదాడలోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్‌ గుత్తా శశిధర్‌రెడ్డి పర్యవేక్షణలో, కన్సల్టెంట్‌ సర్జికల్‌ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్‌ డాక్టర్‌ వెంకటేశ్‌ శ్రీపతి ఆధ్వర్యంలో నిర్వహించిన చికిత్స వివరాలను వెల్లడించారు.

85 ఏళ్ల వయస్సు ఉన్న పుల్లయ్య జ్వరం, కడుపునొప్పితో పాటు మధు మేహం, రక్త పోటు తో బాధపడుతూ పలు ఆసుపత్రులను సంప్రదించినప్పటికీ, ఆయన సమస్యకు స్పష్టమైన కారణం తెలియలేదని వైద్యులు తెలిపారు. అనంతరం మలక్‌పేట యశోద సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రికి వచ్చిన ఆయనకు ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహించారు.

ఈ పరీక్షల్లో పిత్తాశయంలో 22 మిల్లీమీటర్ల పరిమాణంలో రాయి ఉన్నట్లు గుర్తించారు. అదేవిధంగా పెద్దపేగు ప్రాంతానికి దట్టంగా అలుముకున్న ఓమెంటం అనే కొవ్వు కణజాలాన్ని కూడా గుర్తించినట్లు వైద్యులు వివరించారు. రోగి వయస్సు, ఆరోగ్య పరిస్థితి, సమస్యలోని సంక్లిష్టతను పరిగణనలోకి తీసుకొని అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం శస్త్రచికిత్సకు సిద్ధం చేసినట్లు తెలిపారు. ఈ సమావేశం లో కోదాడ ప్రముఖ వైద్యలు డా శ్రీని వాస్ రెడ్డి, మార్కెటింగ్ మేనేజర్ వాసు కిరణ్ రెడ్డి, పుల్లయ్య కుటుంబ సభ్యులు సిబ్బంది ఉన్నారు.

మరిన్ని వార్తలు