ఘనంగా ప్రపంచ మత్స్యకారుల దినోత్సవ వేడుకలు

21-11-2026 | 07:39pm

ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ..

ఆలేరు, నవంబర్ 21 (విజయక్రాంతి): ప్రపంచ మత్స్యకారుల దినోత్సవాన్ని(World Fishermens Day) పురస్కరించుకొని భువనగిరి(Bhongir) పట్టణ ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. శనివారం పట్టణంలోని జ్యోతిరావు పూలే భవన సముదాయ(Jyotirao Phule Building Complex) స్థలంలో ముదిరాజ్ సంఘం పట్టణ అధ్యక్షుడు ఎనబోయిన జహంగీర్ ఆధ్వర్యంలో సంఘం జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మత్స్యకారుల ఐక్యత, హక్కులు, సంక్షేమం, అభివృద్ధి కోసం సంఘటితంగా కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. ముదిరాజ్ సంఘం అభ్యున్నతికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెంట నరసింహ ముదిరాజ్(Penta Narasimha Mudiraj), జిల్లా నాయకులు సాదు విజయకుమార్, ఎనబోయిన ఆంజనేయులు, కుక్కదువ్వు సోమయ్య, ఇట్టబోయిన గోపాల్, పట్టణ ప్రధాన కార్యదర్శి నీల శ్రీనివాస్, మదర్ డైరీ డైరెక్టర్ కస్తూరి పాండు, తుమ్మల పాండు, మొలకల సత్యనారాయణ, బర్ల పోచయ్య, కొలుపుల పెద్ద కృష్ణ, ఉడత భాస్కర్, సామల శోభన్ బాబు, సామల భాస్కర్, పిట్టల రాములు, తుపాకుల సురేష్, పిట్టల కనకయ్య, పిట్టల నాగరాజు, పెంట వినయ్, బండి కృష్ణ, పోతరాజుల రవీందర్, పెంటబోయిన నాగరాజు, లింగాల బిక్షపతి, కొలుపుల సత్యనారాయణ, ఎనబోయిన చంద్రశేఖర్, కానుగుల కృష్ణమూర్తి, దుగ్యాల రవి, చింతకాయల రమేష్, చామకూర రమేష్, పులి వెంకటేష్, సాదు యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు