నృత్య వేదికపై రిమ్స్ అధికారిణి మెరుపులు

30-10-2026 | 11:06am

ఆదిలాబాద్, అక్టోబర్ 30 (విజయక్రాంతి): రాష్ట్రస్థాయి నృత్య ఎంపిక పోటీల్లో ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రి అధికారిణి ఏ. స్వప్న తన ప్రతిభను చాటుకున్నారు. హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ ఆధ్వర్యంలో మూడు రోజులపాటు నిర్వహిస్తున్న అఖిల భారత సంగీత, నృత్య, నాటక పోటీల్లో భాగంగా జరిగిన రాష్ట్రస్థాయి ఎంపిక పోటీల్లో ఆమె పాల్గొన్నారు.

రిమ్స్ ఆసుపత్రిలో నర్సింగ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న స్వప్న కూచిపూడి నృత్య ప్రదర్శనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సంప్రదాయ నృత్యరీతులను చక్కగా ప్రదర్శిస్తూ పలువురి ప్రశంసలు అందుకున్నారు. గతంలోనూ పలు వేదికలపై నృత్య ప్రదర్శనలు ఇచ్చి గుర్తింపు పొందిన స్వప్న, మరోసారి తన కళా ప్రతిభను చాటుకోవడం విశేషం.

మరిన్ని వార్తలు