ఆదివాసీ హక్కుల సాధన కోసం బేలలో TAGS బహిరంగ సభ
14-11-2026 | 04:22pm
బేల,(విజయక్రాంతి): బేల మండల కేంద్రంలో ఆదివాసీ గిరిజన సంఘం (Adivasi Girijana Sangham) ఆధ్వర్యంలో నేడు, రేపు రెండు రోజుల పాటు బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా సభకు ప్రజలు, యువత, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని మండల అధ్యక్షుడు మెస్రం నాగేశ్ కోరారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి పార్చకి గొట్టు, సెడ్మకి నాందేవ్, కొలం సేవా సంఘం అధ్యక్షుడు సంజీవ్ తదితరులు పాల్గొని, బహిరంగ సభను జయప్రదం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.