ఇందిరమ్మ భీమా..పేద ప్రజలకు ధీమా
- దేశంలోనే ఏ రాష్ట్రం చేపట్టని సంక్షేమ పథకాలను తీసుకు వస్తున్న సీఎం రేవంత్ రెడ్డి..
- వివో భవనాల ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
ఉట్నూర్, నవంబర్ 19( విజయక్రాంతి ): దేశంలోని వివిధ రాష్ట్రంలో పేద ప్రజలకు చేపట్టని సంక్షేమ పథకాలను(Welfare scheme) తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం అధినేత సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) తీసుకు వస్తున్నారని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. గురువారం ఇంద్రవెల్లి, ఉట్నూర్ మండలాల్లో పలు గ్రామాల్లో నిర్మించిన గ్రామ సమైక్య భవనాలను ప్రారంభించారు.
ఇంద్రవెల్లి మండలం ఈశ్వర్ నగర్ లో 29 మందికి కళ్యాణ లక్ష్మి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ... రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా పేద ప్రజలను ఆదుకునేందుకు ఇంద్రమ్మ బీమా పథకాన్ని ప్రారంభించారని గుర్తు చేశారు. ఈ పథకం వల్ల పేద ప్రజలకు ఆర్థికంగా ఎంతో ఉపయోగపడుతుందని వివరించారు.
రాష్ట్రంలో వితంతులు, వికలాంగులకు, ఒంటరి మహిళలకు 4.35 లక్షల మందికి చేయూత పింఛన్లు మంజూరు చేసిన ఘనత సీఎం రేవంత్ రెడ్డికి దక్కుతుందన్నారు. తన నియోజకవర్గంలో అర్హులైన వారందరికీ చేయూత పింఛన్లు మంజూరయ్యా అని వివరించారు. పేద ప్రజలు రెండు పూటలా భోజనం చేసే విధంగా సన్నబియ్యాన్ని పంపిణీ చేస్తున్న ఘనత రాష్ట్ర ప్రభుత్వానికి దక్కుతుందని వివరించారు.
ఎల్ నినో ప్రభావం వల్ల వచ్చే వేసవిలో తాగునీటి కి ఇబ్బందులు రాకుండా ఇప్పటినుండే నీటి పొదుపులో పాటించాలని వివరించారు. నీటి పొదుపుతో పాటు విద్యుత్ను ఆదా చేసుకోవలసిన అవసరం ఉందని ప్రజలకు వివరించారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని వివరించారు. ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడమే తన బాధ్యతగా చేస్తున్నానని వివరించారు.
రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల జాబితా సిద్ధంగా ఉందని త్వరలో లబ్ధిదారుల ఎంపిక చేసి లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేస్తామని వివరించారు. పేద ప్రజల కోసం సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రజల కోసం చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు.
ఆయనతోపాటు మార్కెట్ కమిటీ చైర్మన్ ముకాడే ఉత్తం, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎస్సీ విభాగం వైస్ చైర్మన్ దుర్గం శేఖర్, తహసిల్దార్ ప్రవీణ్ కుమార్, ఎంపీడీవో మహేందర్, ఎంపీఈ ఓ సంజీవరావు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహమ్మద్ జహీర్, మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు మాడవి ఇంద్ర దేవ్, మండల సర్పంచులు, కాంగ్రెస్ నాయకులు, గ్రామాల కార్యదర్శులు పాల్గొన్నారు.