నార్సింగిలో భారీ అగ్నిప్రమాదం

19-11-2026 | 05:03pm

హైదరాబాద్: నగర శివారులోని నార్సింగి(Narsingi)లో ఉన్న పసిఫికా హిల్‌క్రెస్ట్ అపార్ట్‌మెంట్‌(Pacifica Hillcrest Apartment)లో గురువారం అగ్నిప్రమాదం కలకలం రేపింది. ఓ టవర్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అపార్ట్‌మెంట్ వాసులు భయంతో బయటకు పరుగులు తీశారు. మంటలు భవనంలోని పలు అంతస్తులకు వ్యాపించడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజిన్లతో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. మంటల వేడికి భవనంలోని ఫాల్ సీలింగ్ దెబ్బతిన్నట్లు సమాచారం. ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ ఘటనలో ప్రాణనష్టం సంభవించలేదని అధికారులు వెల్లడించారు. అగ్నిప్రమాదానికి అసలు కారణం ఏమిటన్నది తెలియాల్సి ఉంది. ఘటనపై అధికారులు వివరాలు సేకరిస్తున్నారు.

మరిన్ని వార్తలు