విదేశీ ప్రతి దిగుమతులను నిలిపివేసి పత్తి రైతన్ననీ ఆదుకోవాలి

10-11-2026 | 04:43pm

బోథ్. నవంబర్ 10 ( విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం(central government) విదేశీ పత్తి దిగుమతులను(foreign cotton imports) వెంటనే నిలిపివేయాలని కాంగ్రెస్ పార్టీ(Congress Party) జిల్లా అధికార ప్రతినిధి పశుల చంటి కేంద్రప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎల్ నినో ప్రభావం వల్ల పత్తి పంట దిగుబడి నిరాశ జనకంగా ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం సిసిఐ విదేశీ కార్పొరేట్ కంపెనీలతో(CCI is a foreign corporate company) పత్తి దిగుమతి కి ఒప్పందం చేసుకోవడం వల్ల భారతదేశంలోని పత్తి రైతులపై(Cotton farmers) తీవ్ర ప్రభావం పడుతుందన్నారు. పత్తి పొనుగోలు ప్రారంభమైన నాటినుండి ఇప్పటివరకు క్వింటాల్కు 1000 రూపాయలు ధర తగ్గి రైతన్నని నష్టం చేస్తున్నారన్నారు.

ఆదిలాబాద్ జిల్లాలో ప్రధాన పంటగా రైతులు పత్తిని సాగు చేస్తున్నారన్నారు. ఇప్పటికైనా బిజెపి ఎంపీ ఎమ్మెల్యేలు పత్తి దిగుమతి నిలిపివేసేరా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే తమ పదవులకు రాజీనామా చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బొడ్డు గంగారెడ్డి, కుచిలాపూర్, గ్రామ సర్పంచ్ మైలి నారాయణ, ఉమేష్, దేవిదాస్, అనిల్ సాయి మహమ్మద్ మైనార్టీ మండల ప్రెసిడెంట్ అలీముద్దీన్ తదితరులు ఉన్నారు.

మరిన్ని వార్తలు