కాంగ్రెస్ పార్టీ నాయకుడిని పరామర్శించిన నియోజకవర్గ ఇన్చార్జి.

28-11-2026 | 06:35pm

బోథ్,(విజయక్రాంతి) మండలంలోని నిగినిగ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు బొజ్జ సాయన్న సహోదరుడు మృతి(Bojja Sayanna Brother Death) చెందడంతో ఆయనను శనివారం సాయంత్రం కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ఆడే గజేందర్ తో పాటు బ్లాక్ ఆత్మ చైర్మన్ జి రాజు యాదవ్ లు పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. అధైర్య పడవద్దని సూచించారు. ఆయన వెంట టీపీసీసీ ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కురుమే మహేందర్, కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ మెరుగు భోజన్న, మర్లపల్లి గ్రామ ఉపసర్పంచ్ రమేష్, నాయకులు మురళి గౌడ్, ఎండి సద్దాం మౌలానా తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు