వంటింట్లో మళ్లీ ధరల సెగ.. సామాన్యుడి జేబుకు చిల్లే

28-11-2026 | 06:35pm

దేశంలో ఇప్పటికే పెరిగిన ధరలతో ఇబ్బందులు పడుతున్న సామాన్యులపై మరోసారి భారం పడే సూచనలు కనిపిస్తున్నాయి. రానున్న రోజుల్లో నిత్యావసర వస్తువుల ధరలు (Essential Commodities) మరింత పెరిగే అవకాశం ఉందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. నవంబర్ నెలవారీ ఆర్థిక సమీక్షలో ద్రవ్యోల్బణం (Inflation) పెరుగుదలపై ఆందోళన వ్యక్తం చేసింది.

అక్టోబర్‌లో దేశ రిటైల్ ద్రవ్యోల్బణం 6.09 శాతానికి చేరగా, ఆహార ద్రవ్యోల్బణం ఏకంగా 8.94 శాతానికి పెరిగింది. ఈ పరిణామం నిత్యావసరాల ధరలపై మరింత ఒత్తిడి పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆహార పదార్థాల ధరలు పెరిగితే సామాన్య కుటుంబాల నెలవారీ బడ్జెట్‌పై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది.

పండుగ సీజన్‌లో పెరిగే వినియోగదారుల డిమాండ్ (Consumer Demand), వాతావరణ పరిస్థితుల్లో మార్పులు, ఎల్‌నినో ప్రభావం ద్రవ్యోల్బణానికి కారణమయ్యే అవకాశాలున్నాయని ఆర్థిక సమీక్ష అంచనా వేసింది. అంతర్జాతీయంగా కొనసాగుతున్న యుద్ధ పరిస్థితులు, ప్రపంచ మార్కెట్లలో అనిశ్చితి కూడా దేశీయ ధరలపై ప్రభావం చూపవచ్చని హెచ్చరించింది.

ఒకవైపు ధరల పెరుగుదలపై ఆందోళన వ్యక్తం చేసిన కేంద్రం, మరోవైపు దేశ ఆర్థిక వ్యవస్థ (Indian Economy)పై విశ్వాసం వెలిబుచ్చింది. ప్రస్తుత సవాళ్లు ఉన్నప్పటికీ భారత ఆర్థిక పునాదులు బలంగా ఉన్నాయని స్పష్టం చేసింది. అయితే ద్రవ్యోల్బణం ఏ స్థాయికి చేరుతుంది? నిత్యావసరాల ధరలను నియంత్రించేందుకు కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకుంటుందనే దానిపై ఇంకా స్పష్టత లేదు.

మరిన్ని వార్తలు