ప్రభుత్వ ఆసుపత్రుల వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలి

28-11-2026 | 06:33pm

 జిల్లా వైద్యాధికారి వెంకట్

రామారెడ్డి, నవంబర్ 28 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా(Kamareddy District) ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందిస్తున్న వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వైద్యాధికారి వెంకట్(District Medical Officer Venkat) అన్నారు. శనివారం రామారెడ్డి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని(Primary Health Center) సందర్శించి రోగులకు వైద్య పరీక్షలు(Medical examinations) నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వైద్య సిబ్బందికి పలు సూచనలు చేశారు. గ్రామాల్లో ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ఆసుపత్రుల సేవలను(Services at government hospitals) వినియోగించుకోవాలని సూచించారు. వైద్య సేవలు అందరికీ అందుబాటులో ఉన్నాయని వివరించారు.

ఈ కార్యక్రమంలో డాక్టర్ సురేష్, వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు