సరైన సాధన చేస్తే సాధించలేనిది ఏది లేదు
పాల్వంచ, (విజయక్రాంతి): ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి(ITDA Project Officer) ఆదేశాల మేరకు ఉమ్మడి ఖమ్మం జిల్లా గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు(Tribal Welfare Ashram Schools in Khammam District), వసతి గృహాల విద్యార్థులకు జోనల్ స్థాయి క్రీడా ఎంపికలు రెండో రోజు శనివారం మోడల్ స్పోర్ట్స్ స్కూల్ కిన్నెరసానిలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఐటీడీఏ భద్రాచలం ఐటిడిఏ ఏసీఎంవో రమేష్ దమ్మపేట ఏటీడీఓ చంద్ర మోహన్, ఖమ్మం ఏ సి ఎం ఓ రాములు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఏ సి ఎం ఓ,ఏ టి డి ఓ మాట్లాడుతూ...సరైన సాధన చేస్తే సాధించలేనిది ఏది లేదు. క్రీడా స్పూర్తినీ కలిగి ఆటలలో మంచి నైపుణ్యం మెళుకువలు నేర్చుకోని రాబోవు రోజుల్లో రాష్ట్ర స్థాయిలో సత్తా చాటాలని అన్నారు. ఉమ్మడి జిల్లాలో ఉన్న బాలబాలికలకు డిసెంబర్ లో జరగబోయే క్రీడా పోటీలలో అన్ని క్రీడా అంశాలలో ఛాంపియన్ షిప్ తీసుకురావాలని కోరారు.
అండర్-14 విభాగంలో కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, టెన్నికాయిట్, చెస్, క్యారమ్స్, అథ్లెటిక్స్, ఆర్చరీ క్రీడల్లో రెండు రోజుల్లో మొత్తం 248 మంది బాలబాలికలు ఎంపికయ్యారు. ఎంపికైన క్రీడాకారులు డిసెంబర్లో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొననున్నారు.
ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ ఆఫీసర్ గోపాల్ రావు, ఏ ఎస్ ఓ లు వెంకట్ నారాయణ రాంబాబు నాగేశ్వరరావు ఎన్ శంకర్రావు పాల్గొన్నారు.