నవోదయ ప్రవేశ పరీక్షకు 3,722 మంది హాజరు

28-11-2026 | 06:33pm

4,284 మందికి గాను 562 మంది గైర్హాజరు.

మూడు జిల్లాల్లో 18 పరీక్ష కేంద్రాల్లో నిర్వహణ

86.88 శాతం మంది విద్యార్థుల హాజరు

నాగర్‌ కర్నూల్,(విజయక్రాంతి): వట్టెం జవహర్ నవోదయ విద్యాలయం(Jawahar Navodaya Vidyalayam)లో 2027–28 విద్యా సంవత్సరానికి ఆరో తరగతి ప్రవేశాల కోసం శనివారం నిర్వహించిన ప్రవేశ పరీక్ష(Entrance Exam) ప్రశాంతంగా ముగిసింది. నాగర్‌ కర్నూల్, వనపర్తి, గద్వాల జిల్లాల్లోని 18 పరీక్ష కేంద్రాల్లో మొత్తం 4,284 మంది విద్యార్థులు(Students) నమోదు చేసుకోగా, 3,722 మంది పరీక్షకు హాజరయ్యారు. 562 మంది గైర్హాజరయ్యారు. మొత్తంగా 86.88 శాతం హాజరు నమోదైంది.

జిల్లాల వారీగా నాగర్‌ కర్నూల్‌లో 2,214 మందికి గాను 1,919 మంది హాజరై 295 మంది గైర్హాజరయ్యారు. గద్వాల జిల్లాలో 1,002 మందికి 903 మంది హాజరై 99 మంది గైర్హాజరయ్యారు. వనపర్తి జిల్లాలో 1,068 మందికి 900 మంది హాజరై 168 మంది గైర్హాజరయ్యారు. నాగర్‌ కర్నూల్ జిల్లాలో 86.68 శాతం, గద్వాలలో 90.12 శాతం, వనపర్తిలో 84.27 శాతం హాజరు నమోదైంది. మూడు జిల్లాల్లో కలిపి గద్వాల జిల్లా అత్యధిక హాజరు శాతాన్ని నమోదు చేసింది.

మరిన్ని వార్తలు