అంబరాన్ని అంటుతున్న.. దండారి సంబరాలు

03-11-2026 | 05:15pm

దండారి ఉత్సవాల్లో నిమగ్నమైన గిరిజనం..

ఉట్నూర్, నవంబర్ 03 (విజయక్రాంతి): ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని గిరిజనులు ప్రతిఏటా దీపావళి పండుగ సందర్భంగా ఘనంగా జరుపుకునే దండారి ఉత్సవాలు గిరిజన గుడాల్లో దండారి సంబరాలు(Dandari Festival) అంబరాన్ని అంటుతున్నాయి. వారం పది రోజులపాటు ఆదివాసుల సంస్కృతి.. సాంప్రదాయం... ఆచారంగా జరుపుకునే దండారి ఉత్సవాల సందర్భంగా గిరిజనులు వ్యవసాయ పనులు వదులుకొని తమ దేవత ఏత్మాసూర్ మొక్కులు చెల్లించుకోవడంలో నిమగ్నమయ్యారు. బండారి ఉత్సవాల సందర్భంగా ఒక ఊరు నుండి మరొక ఊరికి దండారిగా వెళ్లడం.. ఆ గూడెం వాసులు ఇచ్చే ఆధిత్వాన్ని స్వీకరించి గుస్సాడి నృత్యాలు, కోలాటం ఆడుతూ... గోండి భాషలో ఆచార వ్యవహారాల పాటలు పాడుతూ... ఆనందోత్సవాలతో జరుపుకుంటున్నారు.

మరిన్ని వార్తలు