రోగులకు మెరుగైన వైద్యం అందించాలి..

03-11-2026 | 06:04pm

బాన్సువాడ, నవంబర్ 3 (విజయక్రాంతి): నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియోజకవర్గం లోని వర్ని మండల కేంద్రంలోని 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని  ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి(MLA Pocharam Srinivas Reddy) మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు, రోగులకు కల్పిస్తున్న సదుపాయాలను స్వయంగా పరిశీలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులను కలిసి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకోవడంతో పాటు, వైద్యులు అందిస్తున్న చికిత్స, మందుల లభ్యత, ఇతర వైద్య సదుపాయాలపై వివరాలు సేకరించారు. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే పేద, మధ్యతరగతి ప్రజలకు నాణ్యమైన వైద్యం అందుతున్నదా లేదా అనే అంశంపై వైద్యులను ఆరా తీశారు.

అనంతరం డీసీహెచ్‌ఓ శ్రీనివాస్ ప్రసాద్‌తో ప్రత్యేకంగా మాట్లాడి ఆసుపత్రిలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న వైద్య సిబ్బంది వివరాలు, ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ, అవసరమైన వైద్య పరికరాల సమకూర్పు, మౌలిక సదుపాయాల అభివృద్ధిపై చర్చించారు.ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని, రోగులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వైద్యులు, సిబ్బంది బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని అధికారులకు సూచించారు. ఆసుపత్రిలో అవసరమైన సదుపాయాల కల్పనకు సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని పేర్కొన్నారు.ప్రభుత్వ వైద్య సేవలపై ప్రజల్లో నమ్మకం పెరిగేలా వైద్య అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఈ సందర్భంగా పోచారం సూచించారు.

మరిన్ని వార్తలు