దండారి ఉత్సవాలతో ఆదిలాబాద్ జిల్లాకు ప్రత్యేక గుర్తింపు

10-11-2026 | 07:31pm

బోథ్. నవంబర్ 10 ( విజయక్రాంతి): దండారి ఉత్సవాలు(Dandari Festivals) గుసాడీల నృత్యాల వల్ల అదిలాబాద్ జిల్లాకు(Adilabad District) ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిందని కాంగ్రెస్ పార్టీ బోథ్ నియోజకవర్గ ఇన్చార్జి ఆడే గజేందర్ పేర్కొన్నారు. మంగళవారం మండలంలోని నాగపూర్ జైనూరు పల్లి గ్రామాలలో దండారి ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. ఆదివాసీల సంప్రదాయ(Adivasi tradition) పండుగలైన దండారి తరతరాలుగా వస్తున్నదన్నారు. సాంప్రదాయ కలలను ఆచారాలను మరిచిపోవద్దని కొరారు.

ఆయన వెంట మండల పార్టీ కన్వీనర్ మీరు భోజన్న ధనుర్ సర్పంచ్ రోహిణి రెడ్డి, బొమ్మిడి సర్పంచ్ సునీత మధుకర్ మాజీ సర్పంచ్ సీనియర్ నాయకులు ఇంద్రారెడ్డి రమేష్ రెడ్డి, భీమన్న పటేల్ , పూజారి దేవరావు రాథోడ్ సుభాష్, మండల అధికార ప్రతినిధి అచ్చితానంద రెడ్డి ,ఆత్మ డైరెక్టర్ రహీముద్దీన్, సన్నీ రెడ్డి రమేష్ మౌలానా తదితరులున్నారు.

మరిన్ని వార్తలు