నేరాలకు దూరంగా ఉండాలి

10-11-2026 | 07:29pm
  1. రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్
  2. బెల్లంపల్లి ఏసీపీ, కిరణ్ కుమార్ 

బెల్లంపల్లి: మంచిర్యాల జిల్లా(Mancherial District) బెల్లంపల్లి సబ్ డివిజన్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు(Maintenance of law and order) పోలీస్ శాఖ(Police Department) ముందస్తు చర్యలు చేపడుతోన్నది. నేరాలు, అసాంఘిక కార్యకలాపాలను(crimes and antisocial activities) అరికట్టడంలో భాగంగా రౌడీషీటర్లపై(Rowdy sheeters) ప్రత్యేక నిఘా కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా మంగళవారం తాళ్ల గురజాల పోలీస్ స్టేషన్లో బెల్లంపల్లి ఏసీపీ కిరణ్ కుమార్(Bellampalli ACP Kiran Kumar) రౌడీషీటర్లకు కౌన్సెలింగ్ నిర్వహించి పలు సూచనలు చేశారు. గతంలో వివిధ నేరాలకు పాల్పడి రౌడీషీట్లు కలిగిన వ్యక్తులు ఇకనైనా తమ ప్రవర్తన మార్చుకోవాలని సూచించారు.

గొడవలు, దాడులు, బెదిరింపులు, దౌర్జన్యాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. తిరిగి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలిగించకుండా ప్రశాంత వాతావరణానికి సహకరించాలని కోరారు. ముఖ్యంగా యువత చెడు అలవాట్లకు, అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచించారు. కుటుంబ సభ్యుల బాధ్యతలను గుర్తించి గౌరవప్రదమైన జీవనం సాగించాలని హితవు పలికారు.

సబ్ డివిజన్ పరిధిలో జరిగే అనుమానాస్పద కార్యకలాపాలపై నిరంతరం నిఘా ఉంటుందని, రౌడీషీటర్ల కదలికలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తామని తెలిపారు. ప్రజల భద్రత, నేరాల నియంత్రణే పోలీసుల ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ప్రవర్తించినా, ప్రజలను భయభ్రాంతులకు గురిచేసినా చట్టపరమైన చర్యలు తప్పవనిన్నారు. నేరరహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని  కోరారు. ఈ కార్యక్రమములో బెల్లంపల్లి అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ పరిధిలో నీ అన్ని పోలీస్ స్టేషన్ ల  సీఐ ఎస్సైలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు