రైతుల ఎదురు చూపులు.. పంపిణీ

10-11-2026 | 07:38pm

బెజ్జంకి, నవంబర్ 10: సబ్సిడీపై విత్తనాలు పంపిణీ చేస్తామని ప్రకటించిన వ్యవసాయ శాఖ అధికారులు రైతులను గంటల తరబడి నిరీక్షించేలా చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బెజ్జంకి రైతు వేదికలో విత్తనాల పంపిణీ ఉంటుందని వ్యవసాయ అధికారి సంతోష్(Agricultural Officer Santosh) ప్రకటించడంతో మండలంలోని పలువురు మంగళవారం రైతులు ఉదయాన్నే అక్కడికి చేరుకున్నారు. ఆధార్ కార్డు జిరాక్స్‌లు, మట్టి నమూనాలతో క్యూలో నిలబడ్డారు.

అయితే మధ్యాహ్నం దాటినా సంబంధిత అధికారి జాడ లేకపోవడంతో రైతులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. గంటల తరబడి వేచి చూసినా పంపిణీ ప్రారంభం కాకపోవడం, ఫోన్ చేసినా అధికారి స్పందించకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. పరిస్థితిని చక్కదిద్దేందుకు స్థానిక ఎస్సై పోలీసు సిబ్బందిని కూడా పంపించాల్సి వచ్చింది. ఉదయం టోకెన్లు ఇచ్చినవారికి మధ్యాహ్నం విత్తనాలు పంపిణీ చేశారు.

మరిన్ని వార్తలు