రైతుల నడ్డి విరుస్తున్న మోడీ పాలన
కొమురవెల్లి( విజయక్రాంతి ) : కేంద్ర ప్రభుత్వం(Central Government) రైతులు(Farmers) పండించే పంటలకు సరైన గిట్టుబాటు ధరలు(Remunerative prices) ప్రకటించకుండా రైతుల(Farmers') నడ్డి విరుస్తుందని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు అన్నారు. మండల కేంద్రమైన కొమురవెల్లిలో నల్లగొండలో జరిగే అఖిలభారత కిసాన్ సభ(All India Kisan Sabha) 36వ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ భారీ ట్రాక్టర్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ 32 దేశాల వ్యవసాయ ఉత్పత్తులను దేశంలోకి అనుమతించడంతో మన దేశ రైతులు తీవ్రంగా నష్టపోవాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. విద్యుత్ సంస్కరణలను వెంటనే నిలిపివేయాలి అన్నారు.
ఈనెల 15న నల్లగొండలో జరిగే బహిరంగ సభకు రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చి సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ మహాసభలలో రైతు సమస్యలపై చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు కాముని గోపాలస్వామి, సందబోయిన ఎల్లయ్య, ఆముదాల మల్లారెడ్డి, దాసరి ప్రశాంత్, తాడూరి రవీందర్, రాళ్ల బండ శశిధర్ తదితరులు పాల్గొన్నారు