ప్రజా కవి స్వర్గీయ డాక్టర్ అందెశ్రీకి ఘన నివాళులు
ఘట్ కేసర్, నవంబర్ 10 (విజయక్రాంతి): స్వరాష్ట్ర ఉద్యమానికి తన రచనలతో ప్రాణం పోసిన ప్రజాకవి, మహనీయులు స్వర్గీయ డాక్టర్ అందెశ్రీ(Ande Sri) మొదటి వర్ధంతి సందర్బంగా మంగళవారం ఘట్ కేసర్ లోని అందెశ్రీ స్మృతివనం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అందెశ్రీ కుమారుడు దత్త సాయి తో కలిసి పలువురు నాయకులు అందెశ్రీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు వేముల మహేష్ గౌడ్ ఈ సందర్బంగా వారిని స్మరించుకుంటూ తెలంగాణ రాష్ట్ర సాధన సమయంలో వారు రచించిన జయ జయహే తెలంగాణ గీతం చిరస్మరణీయం అన్నారు. తెలంగాణ ప్రజల హృదయాలలో ఆయన సాహిత్యం, సేవలు ఎప్పటికి నిలిచిపోతాయని అన్నారు. అందేశ్రీకి నివాళులు అర్పించిన వారిలో ఘట్ కేసర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బర్ల రాధాకృష్ణ ముదిరాజ్, ప్రధాన ఖయ్యూం, మాజీ ఎంపిటిసి జంపాల రమేష్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు బొక్క సత్తిరెడ్డి, ఉల్లి ఆంజనేయులు యాదవ్, వేముల కేశవనాదంగౌడ్, బాబురావు తదితరులు పాల్గొన్నారు.