2బీహెచ్‌కే ఇళ్లకు మౌలిక వసతులు కల్పించాలి

05-11-2026 | 12:04am

మహబూబ్‌నగర్, నవంబర్ 4 (విజయక్రాంతి): లబ్ధిదారులకు పంపిణీ చేయనున్న 2బీహెచ్‌కే గృహ సముదాయాల్లో అవసరమైన మౌలిక వసతుల పనులను త్వరితగతిన పూర్తి చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్(Additional Collector Madhusudan Naik) అధికారులను ఆదేశించారు. బుధవారం సంబంధిత శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షలో తాగునీరు, విద్యుత్, అంతర్గత రహదారులు, డ్రైనేజీ, పారిశుధ్య పనుల పురోగతిని సమీక్షించారు. గృహాల పంపిణీ సమయానికి అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండేలా శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ సమావేశంలో గృహ నిర్మాణ శాఖ పీడీ ఉపేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు