రైతుల కష్టం దళారుల పాలవుతోంది..
పట్టించుకోని కేడీసీసీ అధికారులు..
మల్యాల, నవంబర్ 04 (విజయక్రాంతి): జగిత్యాల జిల్లా(Jagtial District) మల్యాల మండలంలో ఆరుగాలం శ్రమించి వరి దాన్యం పండించిన రైతులు ఓ వైపు పంటలను రక్షించుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు. దీంతో మల్యాల మండలంలోని కొండగట్టు, సర్వపూర్, తాటి పల్లి, తక్కల్లపల్లి గ్రామంలో రైతులు దళారులను ఆశ్రయించి తక్కువ ధరకే అమ్ముకుంటున్నారు.
మరి కొందరు వ్యాపారులు నేరుగా రైతుల వద్దకే వచ్చి మద్దతు ధర కంటే తక్కువ కొనుగోలు చేస్తున్నారు. కొందరు కోతలు కోయగానే నేరుగా ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకుంటున్నారు. క్వింటాల్‌కు 2700 రూపాయలకే అమ్ముకుని నష్టపోతున్నారు. సంబంధిత అధికారులు కన్నెత్తి కూడా చూడటం లేదు. తక్కువ ధరతో దళారులకు మోసపోతున్న రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు.