మినీ ట్యాంక్‌బండ్‌పై సైన్‌బోర్డుల ధ్వంసం.. కేసు నమోదు
04-11-2026 | 11:59pm
మహబూబ్‌నగర్: నగరంలోని మినీ ట్యాంక్‌బండ్(Mini Tank Bund)పై గుర్తుతెలియని వ్యక్తి విధ్వంసానికి పాల్పడ్డాడు. ఇటీవల ఏర్పాటు చేసిన ‘మన మహబూబ్‌నగర్’ సైన్‌బోర్డుతో పాటు ఇతర బోర్డులను బుధవారం తెల్లవారుజామున ధ్వంసం చేశాడు. ఈ ఘటన సీసీ కెమెరాల్లో రికార్డు కావడంతో నగరపాలక సంస్థ కమిషనర్ రామానుజుల రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ హెచ్చరించారు.