ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ నెల 15 నుంచి పేపర్‌లెస్ పాలన

05-11-2026 | 12:08am

మహబూబ్‌నగర్: ప్రభుత్వ కార్యాలయాల్లో పారదర్శకత, పనితీరు సామర్థ్యం పెంపొందించేందుకు ఈ నెల 15 నుంచి అన్ని శాఖల్లో పేపర్‌లెస్ విధానం అమలు చేయనున్నట్లు డీఆర్వో ఎ. నిర్మల(DRO A. Nirmala) తెలిపారు. డిజిటల్ విధానాలపై ఉద్యోగులకు ఈ నెల 4 నుంచి 6 వరకు కలెక్టరేట్‌లో నిర్వహిస్తున్న మూడు రోజుల శిక్షణను బుధవారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈహెచ్ఆర్ఎంఎస్, ఈ-శాంక్షన్స్, వామిస్, ఐఎఫ్ఎంఐఎస్ తదితర అంశాలపై ఉద్యోగులకు శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ఆన్‌లైన్‌లో ఫైళ్ల నిర్వహణ, దరఖాస్తుల స్థితి తెలుసుకునే సౌకర్యం ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ట్రెజరీ అధికారి బి. శ్రీనివాస్, పీఏఓ వి.ఎస్. చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు