వేముల క్రీడాకారులకు భాస్కర్ నాయక్ చేయూత

05-11-2026 | 12:17am

వాలీబాల్ కోర్టు లైట్ల కోసం రూ.10 వేల ఆర్థిక సాయం

మిడ్జిల్, నవంబర్ 4: గ్రామీణ ప్రాంతాల్లో క్రీడాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో జర్పుల భాస్కర్ నాయక్(Jarpula Bhaskar Naik) తన వంతు సహాయాన్ని అందించారు. వేముల గ్రామం మీదుగా వెళ్తున్న ఆయన సాయంత్రం చీకట్లో వాలీబాల్ ఆడుతున్న క్రీడాకారులను గమనించి తన వాహనాన్ని ఆపి వారి వద్దకు వెళ్లారు. క్రీడలపై వారికున్న ఆసక్తి, పట్టుదలను అభినందించారు.

ఈ సందర్భంగా వాలీబాల్ కోర్టులో లైటింగ్ సౌకర్యం లేకపోవడంతో క్రీడాకారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుసుకున్నారు. వెంటనే లైట్ల ఏర్పాటుకు రూ.10 వేల నగదును అందజేశారు. క్రీడాకారులకు ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. భవిష్యత్తులో కూడా క్రీడాకారులకు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని భరోసా ఇచ్చారు.

క్రీడలు యువతకు మానసిక ఉల్లాసాన్ని, ఆరోగ్యాన్ని అందించడమే కాకుండా వారిని చెడు వ్యసనాలకు, మార్గాలకు దూరంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తాయని ఈ సందర్భంగా భాస్కర్ నాయక్ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు