బెజ్జూర్ లో వీక్లీ రివ్యూ మీటింగ్ నిర్వహించిన ఎంపీడీవో
బెజ్జూర్ అక్టోబర్ 7 (విజయ క్రాంతి): బెజ్జూర్ మండల కేంద్రంలో ని ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో బి. ప్రవీణ్ కుమార్ (MPDO B. Praveen Kumar)ఆధ్వర్యంలో వీక్లీ రివ్యూ మీటింగ్ నిర్వహించడం జరిగిందని అన్నారు.ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించడం జరిగింది.16వ ఆర్థిక సంఘం నిధుల కోసం యూనియన్ బ్యాంక్ అధికారులు (మేనేజర్ ముక్తార్ ) తో ప్రత్యేక అకౌంట్ తెరచుట, నిధుల నిర్వహణ గురించి తెలియజేశారు. VBGRAMG పథకంలో VGPP ప్లాన్, గ్రామానికి 100 మంది లేబర్ కు పనులు కల్పించే విధంగా చూడాలని సూచించారు.
VGSAP - సమగ్ర అభివృద్ధి ప్రణాళిక తయారు చేసి సమర్పించాలని ఆదేశించారు.ఇందిరమ్మ ఇళ్ల పురోగతి సాధించుటపై సమీక్షించారు.
బతుకమ్మ ఆట స్థలాల గుర్తింపు, విద్యుత్ దీపాల ఏర్పాట్లు, సౌకర్యాల కల్పనపై చర్చించారు.ఈ కార్యక్రమంలో ఏపీవో రాజన్న , ఇంచార్జీ ఈ సీ మురళి, పంచాయతీ కార్యదర్శులు, సాంకేతిక సహాయకులు పాల్గొన్నారు.