రిజర్వాయర్ నుండి సాగునీరు విడుదల చేసిన ఎమ్మెల్యే పోచారం..

07-10-2026 | 08:38pm

బాన్సువాడ, అక్టోబర్ 7 (విజయక్రాంతి): నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలోని వర్ని మండలం సిద్దాపూర్ రిజర్వాయర్ లో నిలువ ఉన్న నీటిని మొదటి బండ్‌ నుంచి పంట పొలాలకు బుధవారం ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి(MLA Pocharam Srinivas Reddy) చేతుల మీదుగా సాగునీటినీ విడుదల చేశారు. వర్షభావ పరిస్థితుల దుష్ట పంట పొలాలు ఎండిపోతున్న తరుణంలో రైతులకు ఉపశమనం కొరకు రిజర్వాయర్‌లో నిల్వ ఉన్న నీటిని రైతుల అవసరాలకు అనుగుణంగా వినియోగిస్తూ, ఆయకట్టు పరిధిలోని కొంత వరకైనా పంట పొలాలకు సాగునీరు అందించేలా చర్యలు చేపట్టడం జరిగిందని ఎమ్మెల్యే పోచారం తెలిపారు.

మరిన్ని వార్తలు