సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి

07-10-2026 | 08:37pm

బెజ్జూర్ అక్టోబర్ 7 (విజయ క్రాంతి ): సైబర్ నేరాల(Cybercrimes) పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎస్సై రమేష్(SI Ramesh) అన్నారు. బెజ్జూర్ మండలంలోని ఎలుక పెళ్లి గ్రామంలో ఎస్సై రమేష్, గ్రామ యువకులకు గ్రామ ప్రజలకు సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పించారు. గ్రామంలో గుడుంబా తయారీ, పేకాట, పుంజులాట, యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు.

ఎవరైనా గుడుంబా తయారుచేసిన అమ్మిన సమాచారం అందించాలని సమాచారం అందించిన వారి పేర్లను గోప్యంగా  ఉంచుతామని తెలిపారు. మొదటిసారిగా గ్రామానికి వచ్చినందుకు ఎస్సై రమేష్ ను గ్రామ ప్రజలు యువకులు సాలువతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ యువకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు