కోతలు లేకుండా విద్యుత్తు అందించాలి
07-10-2026 | 08:41pm
రాజాపూర్ అక్టోబర్ 7: ఆరుగాలం కష్టించి వేసిన పంటలు ఎండిపోకుండా కోతలు లేకుండా విద్యుత్ అందించాలని తిరుమలాపూర్ గ్రామ రైతులు బుధవారం ఏఈ వెంకటేష్(AE Venkatesh)కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ సరైన వర్షాలు లేక దీనికి తోడు విద్యుత్తు కోతల వల్ల వరి పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారి పంట పొట్ట దశలో ఉన్నందువల్ల 15 రోజులపాటు కోతలు లేకుండా నిరంతరం నాణ్యమైన విద్యుత్ అందించాలని ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో రైతులు రాజు,నరేందర్,మల్లయ్య,మైనుద్దీన్, బాసు నాయక్ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.