ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య

07-10-2026 | 08:25pm

నంగునూరు, (విజయక్రాంతి): ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతోందని నంగునూరు మండలం(Nanganur Mandal) అక్కెనపల్లి సర్పంచ్ పోతరాజు రేణుక రమేష్ అన్నారు.బుధవారం అక్కెనపల్లి ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు ప్రభుత్వం అందించిన ఉచిత షూస్, బెల్టులను ఆమె తన చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సర్కారు బడుల్లో ఉచిత పుస్తకాలు, యూనిఫాం, మధ్యాహ్న భోజనంతో పాటు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు.దాతల సహకారంతో పాఠశాలను మరింత అభివృద్ధి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ నాగరాపు అఖిల కృష్ణ, వార్డు సభ్యులు సిల్వేరి రేణుక, ఉపాధ్యాయులు బాలకిషన్, రజిత, సంధ్య తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు