వివాహిత ఆత్మహత్య
మఠంపల్లి అక్టోబర్ 07(విజయ క్రాంతి): మండలంలోని చౌటపల్లి గ్రామానికి(Choutapalli village) చెందిన శీలం అంజలి ( 35) కు 20 సంవత్సరాల క్రితం గోవిందపురం గ్రామం,హుజూర్ నగర్ మండలానికి చెందిన శీలం సురేష్ తో వివాహం జరిగింది. వారికి హాసిని,అశ్విక అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.భర్త సురేష్ గత కొద్ది సంవత్సరాలుగా అనారోగ్యంతో బాధపడుతూ, భార్యకు దూరంగా జీవిస్తున్నాడు.
దీంతో అంజలి తన పుట్టింటి గ్రామమైన చౌటపల్లిలో ఉంటూ పిల్లల పోషణ భరిస్తూ జీవనం సాగిస్తోంది.కుటుంబ పోషణ భారంగా మారడంతో జీవితంపై విరక్తి చెంది,బుధవారం ఉదయం 10:30 గంటల ప్రాంతంలో ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడింది. గమనించిన కూతురు అశ్విక, మేనల్లుడు అఖిల్ వెంటనే మఠంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి, అక్కడి నుండి మెరుగైన చికిత్స కోసం హుజూర్ నగర్ ఏరియా ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.
మృతురాలి భర్త శీలం సురేష్ ఫిర్యాదు మేరకు తన భార్య మరణంపై ఎలాంటి అనుమానం లేదని తెలపడంతో,కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.