ఇయు, ఎన్ఎంయు కూటమి గెలుపుతోనే ఆర్టీసీ విలీనం సాధ్యం
సత్తుపల్లి. అక్టోబర్ 7. ( విజయ క్రాంతి ): ఈనెల తొమ్మిదవ తేదీన జరిగే ఆర్టీసీ గుర్తింపు ఎన్నికల్లో ఎంప్లాయిస్ యూనియన్ కూటమి(Employees' Union Alliance) గెలుపుతోనే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయటం కార్మికుల హక్కులు కాపాడటం సాధ్యమవుతుందని ఏఐటియుసి జాతీయ సమితి సభ్యులు శింగు నరసింహారావు, సిహెచ్ సీతామహాలక్ష్మి పిలుపునిచ్చారు.
సత్తుపల్లి డిపో వద్ద ఈరోజు జరిగిన ప్రచార కార్యక్రమంలో వారు మాట్లాడుతూ గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఆర్టీసీలో కార్మికుల హక్కులు పై ఉక్కు పాదం మోపిందని అన్నారు. యూనియన్ రద్దుచేసి కార్మికులను దిక్కులేని వారిగా చూసిన సందర్భంలో ప్రభుత్వాన్ని ఎదిరించి పోరాడిన సంఘం ఎంప్లాయిస్ యూనియన్ మాత్రమేనని వారు చెప్పారు.
ఎంప్లాయిస్ యూనియన్ చొరవతో జెఏసి ఏర్పాటు చేసి సాహసవంతంగా సమ్మె పోరాటం నిర్వహించి కార్మికులకు వేతన పెంపుదల సాధించిందన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి కార్మికులకు ఉద్యోగ హోదా కల్పించాలని ఇది జరగాలంటే ఎంప్లాయిస్ యూనియన్ కూటమి గెలుపుతోనే సాధ్యమవుతుందన్నారు. ఆర్థిక కారణాలు చెప్పి విలీనం నుండి తప్పించుకునేందుకు ప్రభుత్వం తొత్తు సంఘాలను కూడగట్టి విద్రోహం తలపెట్టిందని కార్మికులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు.
రాష్ట్రంలో బస్సు గుర్తు ఖమ్మం రీజియన్ లో కాగడా గుర్తు గెలుపు డిసైడ్ అయిందని ఎవరు ఆపలేరని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం ఆర్గనైజింగ్ కార్యదర్శి దండు ఆదినారాయణ, ఏఐటీయూసీ ఖమ్మం జిల్లా డిప్యూటీ జనరల్ సెక్రెటరీ నిమ్మటూరి రామకృష్ణ, డిహెచ్పిఎస్ నాయకులు తడికమళ్ళ యోబు,
ఎన్ఎంయు నాయకులు ఎన్ బాలస్వామి, కే ఎస్ రావు ఎస్ కే బాజీ జి ఆర్ కృష్ణ టీఎంయూ నాయకులు వై ఎన్ న్ రాజు ఈయూ నాయకులు ఎన్ ఆర్ కృష్ణ, బి రాంబాబు రఘు బాల్ రావు రాంబాబు తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు.