పీఆర్‌సీ వెంటనే ప్రకటించి సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలి!
టిపిటిఎఫ్ మండల అధ్యక్షులు వరగంటి సంతోష్ కుమార్ గుప్తా!!
శివంపేట అక్టోబర్ 7 (విజయక్రాంతి): పీఆర్‌సీని వెంటనే ప్రకటించి సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని టీపీటీఎఫ్ శివంపేట మండల అధ్యక్షులు వరగంటి సంతోష్‌కుమార్ గుప్తా(TPTF Mandal President Varaganti Santosh Kumar Gupta) ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం శివంపేట మండలంలోని వివిధ పాఠశాలలను టీపీటీఎఫ్ మండల బాధ్యులు నారాయణగౌడ్, శ్రీనివాస్, సింహం సందర్శించి ఉపాధ్యాయుల సమస్యలను సేకరించడంతో పాటు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయా పాఠశాలల్లో ఉపాధ్యాయులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, ఉద్యోగులకు సంబంధించిన పీఆర్‌సీని తక్షణమే ప్రకటించాలని, సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. మండలంలోని వివిధ పాఠశాలల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.