ముఖ్యమంత్రి కుటుంబంపై అసత్య ప్రచారాలు..

07-10-2026 | 08:35pm

చర్యలు తీసుకోవాలి..

ఎస్పీకి వినతి పత్రం 

శివంపేట్ అక్టోబర్ 7 (విజయక్రాంతి): జిల్లా ఎస్పీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కుటుంబ సభ్యులపై కొంతమంది వ్యక్తులు సోషల్ మీడియా వేదికల ద్వారా ముఖ్యంగా ఒక యూట్యూబ్ ఛానల్ లో అసత్యమైన, నిరాధారణమైన వాప్తవాలకు విరుద్దమైన వార్తలు, ఆరోపణలు ప్రచారం చేస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. సదరు ప్రచారంలో వాస్తవాలను ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ముఖ్యమంత్రి ప్రతిష్టకు భంగం కలిగించే ఉద్దేశంతో ప్రసారం చేస్తున్నట్లు కనిపిస్తుంది.

కావున ఇటువంటి తప్పడు ప్రచారం ప్రజల్లో అనవసరమైన అపోహలు, గందరగోళం కలిగించే విధంగా యూట్యూబ్ ఛానల్ సంబంధిత వ్యక్తులు ప్రచారం చేసిన వీడియోలు/పోస్టులను వాటి వాస్తవికతపై సమగ్ర విచారణ జరిపించి, చట్ట విరుద్దమైన చర్యలు, ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచార ప్రచారం లేదా పరువు ప్రతిష్టకుమడ్లు భంగం కలిగించే విధంగా ఎవరూ మాట్లాడిన అసత్య ప్రచారాలు చేసిన వారిపై నిఘా ఉంచి వెంటనే చట్టరీత్యమైన చర్యలు తీసుకోవాలని ఎస్పీకి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మాచినూర శ్రీశైలం యాదవ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ చిలుముల సువాసిని రెడ్డి, మెదక్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి బండారి గంగాధర్, కొండి దుర్గేష్, బెస్ట చిరంజీవులు, కుమ్బరి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు