నేరడిగొండలో ఉచిత మెగా వైద్య శిబిరం ప్రారంభం
నేరడిగొండ నవంబర్ 21 (విజయక్రాంతి) : నేరడిగొండ మండల(Neradigonda Mandal) కేంద్రంలో గిరిజన ప్రాంతాల ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు ఉచిత మెగా వైద్య శిబిరాన్ని(Free Medical Camp) నిర్మల్ సప్న మిల్టీస్పెషల్టి హాస్పిటల్(Nirmal Swapna Multispeciality Hospital) ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. బోథ్ శాసనసభ్యులు అనిల్ జాదవ్(Anil Jadhav) వైద్య శిబిరం ప్రారంభించారు. పెద్ద ఎత్తున గిరిజనులు ప్రజలు తరలిరాగా వారికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు.
మొత్తం వెయ్యి మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి స్వప్న హాస్పిటల్ లో మెరిగిన వైద్యం అందిస్తామని రోగులకు భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు నాలం స్వప్న శశికాంత్, గుండె వైద్య నిపుణులు కిషన్, ఆర్థోపెడిక్ చేతన్, యూ రా లోజిస్ట్ అశోక్, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు