అసభ్య వ్యాఖ్యల సెగ.. పోలీస్ స్టేషన్లకు కాంగ్రెస్ నేతలు
సిద్దిపేట రూరల్, నవంబర్ 21 (విజయక్రాంతి): తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డిపై సిద్దిపేట మాజీ మున్సిపల్ చైర్మన్ కడవేర్గు రాజానర్సు అసభ్య పదజాలంతో వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలను ఖండిస్తూ సిద్దిపేటకు చెందిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు శుక్రవారం సిద్దిపేట వన్‌టౌన్, త్రీటౌన్ పోలీస్ స్టేషన్లలో (Police Stations) ఫిర్యాదు చేశారు.
కడవేర్గు రాజానర్సుపై కేసు నమోదు చేసి, చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని (Legal Action) పోలీసులను కోరారు. అవసరమైన విచారణ చేపట్టి బాధ్యుడిని అరెస్టు చేయాలని (Arrest Demand) డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో బాబు జగ్జీవన్ రామ్ జిల్లా అధ్యక్షుడు ఎర్ర మహేందర్, మైనార్టీ జిల్లా అధ్యక్షుడు రషాద్, అసెంబ్లీ ప్రెసిడెంట్ వాహబ్, టీఎంపీఎస్ జిల్లా అధ్యక్షుడు, డీసీసీ కార్యదర్శి చెంది శ్రీనివాస్ ముదిరాజ్, సీనియర్ నాయకులు మిద్దె రవి, బుగ్గ రాజేశ్వర ఆలయ చైర్మన్ బాగన్న కరుణాకర్, చిన్నకోడూరు ఏఎంసీ వైస్ చైర్మన్ బుస్సు రాజశేఖర్, ఎన్‌ఎంఆర్ జిల్లా అధ్యక్షుడు పిల్లి నరసింహులు, ఆత్మ కమిటీ డైరెక్టర్లు అజ్మత్, అశోక్ బాబు, నాయకులు నరేష్, పవన్ తదితరులు పాల్గొన్నారు.