చెకుముకి సైన్స్ పోటీల్లో కేరళ గ్లోబల్ హైస్కూల్ సత్తా

21-11-2026 | 05:34pm

రుద్రంగి నవంబర్ 21(విజయక్రాంతి) : రుద్రంగి మండల(Rudrangi Mandal) కేంద్రంలోని స్థానిక జిల్లా పరిషత్ హైస్కూల్‌లో(Zilla Parishad High School) మండల స్థాయిలో నిర్వహించిన చెకుముకి సైన్స్ సంబరాల్లో ప్రైవేట్ పాఠశాలల విభాగంలో కేరళ గ్లోబల్ హైస్కూల్ ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ బాబు నంబియార్ మాట్లాడుతూ మా పాఠశాల విద్యార్థులు సాధించిన ఈ విజయం ఎంతో గర్వకారణమని విద్యార్థుల ప్రతిభకు, ఉపాధ్యాయుల కృషికి ఇది నిదర్శనమని తెలిపారు.ఈ విజయానికి కృషి చేసిన విద్యార్థులకు, ఉపాధ్యాయులకు  ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.

మరిన్ని వార్తలు