ములకలపల్లిలో చెకుముకి సైన్స్ సంబురాలు
ములకలపల్లి, నవంబర్ 21 (విజయక్రాంతి): ములకలపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం చెకుముకి సైన్స్ సంబురాలు (Science Celebrations) నిర్వహించారు. ఈ సందర్భంగా మండల స్థాయి ప్రతిభా పరీక్ష (Talent Test) ఏర్పాటు చేశారు. పరీక్ష పత్రాలను మండల విద్యాధికారి (MEO) జి. సత్యనారాయణ విడుదల చేసి పరీక్షను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ.. ఇలాంటి పరీక్షలు రాయడం ద్వారా విద్యార్థులకు పోటీ పరీక్షలపై (Competitive Exams) అవగాహన పెరుగుతుందని తెలిపారు. జన విజ్ఞాన వేదిక మండల కార్యదర్శి ఎం.పి. వెంకన్న మాట్లాడుతూ.. విద్యార్థుల్లో సైన్స్ పట్ల ఆసక్తి పెంపొందించడం, మూఢనమ్మకాలపై అవగాహన కల్పించడం జన విజ్ఞాన వేదిక ముఖ్య ఉద్దేశమని వివరించారు.
ఈ కార్యక్రమంలో సైన్స్ ఉపాధ్యాయులు కే. కృష్ణ బిచ్చ, పి. నాగేశ్వరరావు, ఎస్.కె. రహీముద్దీన్, ఉషారాణి, శ్రీలేఖ జ్యోతి, కృష్ణ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.