నాచారం గుట్టకు పోటెత్తిన భక్తులు

21-11-2026 | 05:26pm

 91 జంటలచే శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు

 గజ్వేల్, నవంబర్ 21: కార్తీక మాసం రెండో శనివారం సందర్భంగా సిద్దిపేట జిల్లా(Siddipet District) వర్గల్ మండలం నాచారం గుట్టలోని శ్రీశ్రీశ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి(Sri Sri Sri Lakshmi Narasimha Swamy Temple) భక్తులు(devotees) పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా 91 మంది జంటలు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలను భక్తిశ్రద్ధలతో(devotional) ఆచరించారు.

భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కార్యనిర్వహణ అధికారి బి. రంగాచారి పర్యవేక్షణలో దేవస్థాన సిబ్బంది తగిన ఏర్పాట్లు చేశారు. కార్తీక మాసం సందర్భంగా ఆలయంలో భక్తుల(devotees) సందడి నెలకొంది. రాత్రి దీపోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.

మరిన్ని వార్తలు