5వ వార్డులో ఇందిరమ్మ కుటుంబ భరోసా పథకంపై ప్రత్యేక క్యాంపు
అర్హులైన ప్రతి ఒక్కరూ ఆన్లైన్లో నమోదు చేసుకోవాలి
మంథని మున్సిపల్ వైస్ చైర్మన్ ముస్కుల సహేందర్ రెడ్డి
మంథని, నవంబర్21(విజయక్రాంతి) : మంథని మున్సిపాలిటీ(Manthani Municipality) పరిధిలోని కూచిరాజ్పల్లి 5వ వార్డులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా భరోసా పథకంపై(Indiramma Family Life Insurance Assurance Scheme) ప్రత్యేక నమోదు శిబిరం నిర్వహించారు. స్థానిక కౌన్సిలర్, మున్సిపల్ వైస్ చైర్మన్ ముస్కుల సహేందర్ రెడ్డి అధికారులతో కలిసి శిబిరంలో పాల్గొని అర్హులైన లబ్ధిదారుల(Beneficiaries) వివరాలను పరిశీలించి ఆన్లైన్లో నమోదు చేయించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ కుటుంబ భరోసా పథకానికి అర్హులైన ప్రతి ఒక్కరూ తమ వివరాలను ఆన్లైన్లో నమోదు చేసుకొని పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు(Duddilla Sridhar Babu) సహకారంతో మంథని పట్టణంలో పలు సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు అమలవుతున్నాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మెప్మా ఆర్పీ లక్ష్మీదేవి, స్థానిక నాయకులు జానీ, పద్మ, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.