రాష్ట్రస్థాయి ఉత్తమ అధ్యాపక అవార్డు

07-10-2026 | 04:57pm

భిక్కనూర్, అక్టోబర్‌ 7 (విజయ క్రాంతి): రాష్ట్రస్థాయి ఉత్తమ అధ్యాపక అవార్డు(State-level Best Teacher Award) అందుకున్న ఉస్మానియా యూనివర్సిటీ ఆర్‌సీయూఈఎస్‌(Osmania University RCUES) సంచాలకులు, భూగోళ శాస్త్ర విభాగం సీనియర్‌ ప్రొఫెసర్‌ బి. శ్రీ నాగేష్‌ను తెలంగాణ యూనివర్సిటీ దక్షిణ ప్రాంగణం జియోఇన్ఫర్మాటిక్స్‌ విభాగం అధ్యాపకులు ఘనంగా సన్మానించారు.

శాలువా, పుష్పగుచ్ఛంతో సత్కరించారు. పట్టణీకరణ, పట్టణాభివృద్ధి, పర్యావరణ పరిరక్షణపై అధ్యయనాలు, పరిశోధనలకు సహకరిస్తామని నాగేష్‌ తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ డా. ఆర్‌. సుధాకర్‌గౌడ్‌, డా. టి. ప్రతిజ్ఞ, డా. ఎస్‌. నారాయణగుప్తా, డా. ఆనంద్‌, డా. విగ్నేష్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు