మెగా డీఎస్సీ కాదు.. మాయ డీఎస్సీ!

07-10-2026 | 05:13pm

ఎమ్మెల్యే పల్లా ఫైర్

జనగామ, అక్టోబర్ 7 (విజయక్రాంతి): జనగామ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బుధవారం ఎమ్మెల్సీ పట్టభద్రుల ఓటర్ల నమోదు ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి(MLA Palla Rajeshwar Reddy) మాట్లాడుతూ.. బీఆర్ఎస్ హయాంలో 1.60 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశాం. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 12 వేల ఉద్యోగాలే ఇచ్చింది. మెగా డీఎస్సీ పేరుతో పాత నోటిఫికేషన్ నే మార్చి ఇచ్చారు. ఇది మెగా డీఎస్సీ కాదు మాయ డీఎస్సీ. రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో ఖాళీల భర్తీకి కేవలం 46 పోస్టులకే అనుమతి ఇచ్చారు.

మూడేళ్లుగా నియామకాలే లేవు. ఉస్మానియాకు రూ.1000 కోట్లు ఇస్తామని హామీ ఇచ్చి నిధులు ఇవ్వలేదు. ప్రతి గ్రామానికి ఒక ఇన్ చార్జిని నియమించి, ప్రతి 100 మంది ఓటర్లకు ఒకరి చొప్పున బాధ్యతలు అప్పగించి నమోదును పకడ్బందీగా పూర్తి చేయాలి. డిగ్రీ సర్టిఫికెట్, చిరునామా ఆధారం, ఫొటోతో కేవలం నాలుగు దశల్లోనే ఆన్ లైన్ నమోదు పూర్తవుతుంది. గులాబీ జెండాతో గెలిచి బీఆర్ఎస్ సర్పంచులను వేధించడం సరికాదు. బెదిరింపులకు భయపడొద్దు, ఆర్టీసీ కార్మికులకు, బీఆర్ఎస్ కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుంది అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్, తాటికొండ రాజయ్య, బిఆర్ఎస్ నాయకులు రాకేష్ రెడ్డి, సురేష్ రెడ్డి, నర్సింగరావు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు