ఎట్టకేలకు నాగల్‌గిద్ద కాంప్లెక్స్‌కు హెచ్‌ఎం
మారుతి జాదవ్‌కు బాధ్యతలు.. ఉపాధ్యాయ సంఘాల సన్మానం
నాగల్‌గిద్ద, అక్టోబర్ 7 (విజయక్రాంతి): నాగల్‌గిద్ద కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుడిగా(Nagalgidda Complex Headmaster) మారుతి జాదవ్‌ను నియమించడంతో ఉపాధ్యాయ సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేశారు. గత రెండేళ్లుగా గెజిటెడ్ హెచ్‌ఎంగా బాధ్యతలు ఉన్నప్పటికీ జిల్లా సైన్స్ అధికారిగా కొనసాగుతున్న నేపథ్యంలో కాంప్లెక్స్ పరిధిలోని పాఠశాలల పర్యవేక్షణ కొరవడిందని, రెగ్యులర్ హెచ్‌ఎంను నియమించాలని కెవీపీఎస్ నాయకులు పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
ఈ నేపథ్యంలో మారుతి జాదవ్‌ను కాంప్లెక్స్ హెచ్‌ఎంగా నియమించడంతో పాఠశాలల పర్యవేక్షణ మెరుగుపడుతుందని ఉపాధ్యాయులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మారుతి జాదవ్ మాట్లాడుతూ కాంప్లెక్స్ పరిధిలోని పాఠశాలలను క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తూ, విద్యా ప్రమాణాల మెరుగుదలకు ప్రత్యేక దృష్టి సారిస్తానని తెలిపారు.
విద్యార్థుల విద్యాభివృద్ధికి ఉపాధ్యాయులతో సమన్వయంగా పనిచేస్తూ తనవంతు కృషి చేస్తానన్నారు. అనంతరం ఉపాధ్యాయులు గణపతిచౌహాన్, విజేందర్ రెడ్డి, విఠల్, ఓంబసవ, కాశీరాం, శివకుమార్,పీఆర్టీయూ, యూటీఎఫ్, టీపీటీఎఫ్, ఎస్టీయూ, టపాస్ తదితర ఉపాధ్యాయ సంఘాల నాయకులు మారుతి జాదవ్‌ను శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.