అప్పుల బాధతో వస్త్ర వ్యాపారీ మృతి..
07-10-2026 | 05:13pm
రామాయంపేట అక్టోబర్ 7 (విజయ క్రాంతి): అప్పుల బాధతో ఓ వస్త్ర వ్యాపారి మృతి(Textile merchant dies) చెందిన సంఘటన రామాయంపేట లో బుధవారం జరిగింది.స్థానిక ఎస్ ఐ బాలరాజ్ తెలిపిన వివరాల ప్రకారం పట్టణానికి చెందిన మద్దెల క్రిష్ణ (55) వస్త్ర వ్యాపారం తో అంబులెన్సు నడుపుతాడు. వీటిల్లో నష్టాలు వచ్చి అప్పుల పాలు అయ్యాడు.
దీంతో అవి తీరే మార్గం లేక తీవ్ర మనస్తాపం చెందిన అతను స్థానిక కేసీఆర్ కాలనీ సమీపంలో నేషనల్ హైవే 44 ప్రక్కన చెట్టుకు ఉరి వేసుకుని మృతి చెందాడు. మృతుని కుటుంబీకుల పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.