మున్సిపల్ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి....

07-10-2026 | 05:03pm

వారానికి ఒకరోజు సెలవు, క్యాజువల్ లీవ్స్ అమలు చేయాలి – జైపాల్ రెడ్డి.....

యాదగిరిగుట్ట, అక్టోబర్ 7 (విజయక్రాంతి): యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని మున్సిపల్ స్టాఫ్ అండ్ కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ వర్కర్స్ యూనియన్(Municipal Staff and Contract/Outsourcing Workers Union) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జైపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం యాదగిరిగుట్టలోని సీపీఐ కార్యాలయంలో మున్సిపల్ కార్మికుల సమావేశం పేరబోయిన స్వామి అధ్యక్షతన జరిగింది.

ఈ సమావేశానికి జైపాల్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరైన మాట్లాడుతూ, మున్సిపాలిటీ పరిశుభ్రత, పారిశుద్ధ్యం, ప్రజలకు అవసరమైన సేవలను అందించడంలో కార్మికులు కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ వారి హక్కులు, సంక్షేమం విషయంలో నిర్లక్ష్యం చేయడం సరికాదన్నారు. కార్మికులకు వారానికి ఒకరోజు వీక్లీ ఆఫ్, క్యాజువల్ లీవ్స్, పండుగ మరియు జాతీయ సెలవులు అమలు చేయాలని డిమాండ్ చేశారు.

అలాగే ప్రతి కార్మికుడికి కనీస వేతనం.26/- వేలు  చెల్లించాలని, కార్మికుల శ్రమకు తగిన వేతనం కల్పించి వారి కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించాలని కోరారు. కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో అధికారులు సానుకూలంగా స్పందించాలని, లేనిపక్షంలో యూనియన్ ఆధ్వర్యంలో తదుపరి కార్యాచరణ చేపడతామని హెచ్చరించారు. అనంతరం కార్మికుల సమస్యలు, డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని యాదగిరిగుట్ట మున్సిపల్ మేనేజర్‌ సుమిత్రకి అందజేశారు. 

 ఈ కార్యక్రమంలొ ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు బోలగాని సత్యనారాయణ,ప్రధాన కార్యదర్శి ఎండి ఇమ్రాన్, సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు గోదా శ్రీరాములు,సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కళ్లెం కృష్ణ,ఏఐవైఎఫ్ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి పెరబోయిన  మహేందర్, సిపిఐ పట్టణ కార్యదర్శి బబ్బురి శ్రీధర్, మాజీ కోఆప్షన్ సభ్యులు పేర బోయిన పెంటయ్య, రైతు సంఘం మండల కార్యదర్శి పెరబోయిన బంగారు,

ఏఐటియుసి మండల కార్యదర్శి గోపగాని రాజు,గీతా పని వరల సంఘం మండల కార్యదర్శి గుండు వెంకటేష్, మున్సిపల్ కార్మిక సంఘం అధ్యక్షులు గడిపే జహంగీర్, గ్యాదపాక స్వామి,గోపి, జయమ్మ కొన్ని అయిలమ్మ, సూదగాని అయ్యం, గేదపాక హరిబాబు, కలమ్మ, ప్రమీల తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు