సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం
07-10-2026 | 05:05pm
భూపాలపల్లి రూరల్, అక్టోబర్ 07 ( విజయక్రాంతి ) : సైబర్ నేరాలపై నిర్వహించే అవగాహన సదస్సు అయిన సైబర్ జాగృత దివస్(Cyber Awareness Day) సందర్భంగా భూపాలపల్లి పట్టణ సీఐ చెన్నూరి శ్రీనివాస్(CI Chennuri Srinivas) ఆదేశాల మేరకు గొర్లవీడు గ్రామములో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా సైబర్ నేరాలైన ఆన్లైన్ షాపింగ్ ఫ్రాడ్స్, పార్ట్ టైమ్ జాబ్స్ ఫ్రాడ్, ఇంపర్సనేషన్ ఫ్రాడ్స్, పీఎం కిసాన్ యోజన, ఏపీకే ఫైలు, ఆర్టీఒ ఈ చలానాలకు సంబంధించిన నేరాలపైన ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు బానోత్ గీత, ఏ రవళి, సైబర్ వారియర్ సముద్రాల తిరుపతి, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.