రైతు బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి

28-11-2026 | 04:46pm

బోథ్, నవంబర్ 23 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమంతోపాటు ప్రతి కుటుంబానికి భరోసా కల్పించే లక్ష్యంతో చేపట్టిన ఇందిరా రైతు బీమా పథకాన్ని (Indira Rythu Bima) ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీవో రమేష్ కోరారు. మండలంలోని పిప్పలుదరి గ్రామంలో పథకం అమలులో భాగంగా చేపడుతున్న కంప్యూటరీకరణ (Data Entry) పనులను ఆయన పరిశీలించారు.

ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ వివరాలను ఎలాంటి తప్పులు లేకుండా కంప్యూటర్‌లో నమోదు చేయాలని సూచించారు. నమోదు ప్రక్రియలో (Registration Process) పొరపాట్లు జరిగితే భవిష్యత్తులో లబ్ధిదారులు నష్టపోయే అవకాశం ఉందని హెచ్చరించారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి వివరాన్ని జాగ్రత్తగా పరిశీలించి నమోదు చేయాలని సిబ్బందికి సూచించారు.

ఎంపీడీవో వెంట స్థానిక సర్పంచ్, మాజీ సర్పంచ్ శ్రీధర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మహిళా మండల అధ్యక్షురాలు నీరజతోపాటు పలువురు గ్రామస్తులు ఉన్నారు.

మరిన్ని వార్తలు