స్థానికంగా ఉండి వైద్య సేవలు అందించాలి..
* ఉట్నూర్ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన జాతీయ కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ నాయక్..
ఉట్నూర్, నవంబర్ 04 (విజయక్రాంతి): వైద్యాధికారులు వైద్య ఉద్యోగులు స్థానికంగా అందుబాటులో ఉండి వైద్య సేవలు అందించాలని జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ నాయక్(Jathoth Hussain Naik) అన్నారు. బుధవారం నిర్మల్ జిల్లా బిజెపి అధ్యక్షుడు రితేష్ రాథోడ్ తో పాటు బిజెపి నాయకులతో కలిసి ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రి డైరెక్టర్ ఉపేందర్ జాదవ్ వైద్యాధికారులు సన్మానం చేసి పుష్పగుచ్చనించి స్వాగతించారు.
అనంతరం ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు గురించి అడిగి తెలుసుకుని ఆయన వైద్యాధికారులతో మాట్లాడుతూ ఆసుపత్రిలో అసౌకర్యాల గురించి సౌకర్యాల గురించి వైద్య పోస్టులకు ఖాళీల గురించి తదితర విషయాలపై మాట్లాడారు. ఆసుపత్రిలో నెలకొన్న సౌకర్యాల ను కల్పించేందుకు కృషి చేస్తానని ఎస్సీ ఎస్టీ జాతీయ కమిషన్ సభ్యులు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బిజెపి నిర్మల్ జిల్లా అధ్యక్షులు రితీష్ రాథోడ్, ఆసుపత్రి సూపర్డెంట్ ఉపేందర్ జాదవ్, బిజెపి జిల్లా కార్యదర్శి కొండేరి రమేష్, బిజెపి మండల అధ్యక్షులు బింగి వెంకటేష్, మహిళా నాయకురాలు సుమన్ బాయి జాదవ్, నాయకులు రాజేశ్వర్, వైద్యాధికారులు వైద్య ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.