కన్నుల పండుగగా అయ్యప్ప మహపడి పూజ

28-11-2026 | 11:05pm

బోథ్ నవంబర్28(విజయక్రాంతి) : నేరడిగొండ మండల(Neradigonda Mandal) కేంద్రంలోని ఎమ్మెల్యే ఇంటి వద్ద శనివారం రాత్రి నిర్వహించిన మహాపడి పూజ కార్యక్రమం కన్నుల పండుగగా జరిగింది. గురుస్వామి పురుషోత్తం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాల చెందిన అయ్యప్ప స్వాములు హాజరయ్యారు. కార్యక్రమంలో ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్ శిష(Adilabad District Collector Rajar Shisha) పాల్గొనడం జరిగింది. ఎమ్మెల్యే యాదవ్ అనిల్ కుమార్(MLA Anil Kumar Yadav) అయ్యప్ప మాల ధరించడంతో సహా పడిపూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మెట్ల పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దంపతులు ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు.

మరిన్ని వార్తలు